Kvr welfare organization has organized free medical health camps on 30 August 2022 at Khatam gudem (bondas tribal) region of odhisa and Panthala Chintha, paderu , Andhra Pradesh
కె.వి.ఆర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పేదలకు కూరగాయలు,నిత్యవసరాల పంపిణీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం గ్రామీణ మండలం వెల్లసావరం గ్రామానికి చెందిన పి ఎం పి డాక్టర్ కొప్పిశెట్టి వీర వెంకట సత్య నారాయణ తన తండ్రి పేరు మీద సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలనే సత్సంకల్పంతో కెవిఆర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అనే సంస్థను స్థాపించి 2017 సంవత్సరం నుంచీ సామాజిక సేవకు శ్రీకారం చుట్టారు. వెల్ల గ్రామ శివారు వెల్ల సావరం గ్రామానికి చెందిన ఏడు పేద కుటుంబాలను ఆయన దత్తత తీసుకొని నెలకు సరిపడా కూరగాయలు, నిత్యావసరాలను వారికి నెలనెలా ఉచితంగా అందించడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు ఏడుగురు నిరుపేదలకు వారికి అవసరమైన కూరగాయలు, నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. వెల్ల సావరానికి చెందిన ఒక సామాన్య కుటుంబీకుడి దాతృత్వ గుణాన్ని, సామాజిక స్పృహను చూసి జనాలు ఆశ్చర్య చకితులవు తున్నారు. ఒక పీఎంపీ డాక్టర్ తాను సంపాదించిన దానిలో కొంత భాగం ప్రజా సేవకు వెచ్చించడం అనేది ఆయన సేవా నిరతికి నిదర్శనంగా చెప్పవచ్చు. తాను చేసే కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకొని మరింత మంది ఈ సామాజిక సేవ వైపు అడుగులు వేయాలనే ఉద్దేశంతో తాను సామాజిక సేవా రంగంలోకి దిగానని ఈ సందర్భంగా కొప్పిశెట్టి వెల్లడించారు. అలాగే దివ్యాంగుల కోసం 4 ట్రై సైకిళ్లను కొని వాటిలో రెండు సైకిళ్ళను రామచంద్ర పురానికి చెందిన బెతస్తా అనాధ శరణాలయం పిల్లలిద్దరికీ వితరణగా అందించారు. మిగిలిన రెండు ట్రై సైకిళ్లను పెదపూడి మండలం జి. మామిడాడలో పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కరోనా సమయంలో ఎంతోమందికి ఉచితంగా వైద్య సేవలు అందించిన కె.వి.ఆర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ రామచంద్రపురం లోని ఏరియా ఆసుపత్రి, ఇతర ఆసుపత్రి లయందు ఉన్న టీబీ రోగులకు అందరికీ ఉచితంగా మందులను అందిస్తున్నారు. పి ఎంపీ డాక్టర్ కొప్పిశెట్టి వీర వెంకట సత్య నారాయణ కేవీఆర్ సంస్థ ద్వారా చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలకు ఎవరైనా సరే ఫిదా కావాల్సిందే. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా రామచంద్రపురం బార్ అసోసియేషన్ అధ్యక్షులు పిల్లి మురళి, రాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వాసంశెట్టి శ్యాము, ప్రముఖ శెట్టిబలిజ నాయకులు నరాల ఏడుకొండలు, టెక్ ఎక్స్పెక్ట్ సొల్యూషన్స్ అధినేత వాసంశెట్టి జనార్ధన్ హాజరయ్యారు. కార్యక్రమంలో కె.వి.ఆర్ సంస్థ అధినేత కొప్పిశెట్టి లక్ష్మి, దంగేటి చినబాబు, ఇంత సుకుమారన్,ఎరమాటి జీవానందం, నరాల రాధాకృష్ణ, జూడో రత్నం, జార్జి బాబు, నిల్లా వీరబ్రహ్మం, ఏరియా ఆసుపత్రి హెచ్ పి జీ. బేబీ రాణి, డాక్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్, సురేంద్రనాథ్ త్రిపాటి, కుడుపూడి అంజి, పంపన ధర్మ శ్రీను, పిల్లి శేషగిరి, నరాల శ్రీనివాస్, పితాని సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.